608
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
దేశ బంధువు యేసువే మన దేశ రక్షకు డాయనే దేశ మంత యేసు మనసుతో నాశతో సేవించుడి ||దేశ||
నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలగియు నిత్య ప్రేమ చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ||
వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ విధము లేక మేలు లేదు ||దేశ||
ప్రేమ గలగి పరమ సత్య ప్రేమ సేవ జేయుడి ప్రేమమూర్తి యేసుకీస్తు ప్రేమలలో వర్ధిల్లు డిలలో ||దేశ||
ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని భువిని సేలు రాజు యేసుడే ||దేశ||
إرسال تعليق