స్తుతియు మహిమయు నీకె క్షితికిన్

572

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు||

  1. పసిడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్ బ్రసరించు కో తలో పల నుందు వీవు ||స్తుతియు||

  2. నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు ఋణపడి యు న్నాము నీకు ||స్తుతియు||

  3. దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్ ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరత దీర్చెడు సర్వ వరము లమర్చిన పరమోపకారి ||స్తుతియు||

  4. జీవంబు ప్రేమను జేవ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ రించు ||స్తుతియు||

  5. నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయె గృ పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనకా ||స్తుతియు||

  6. మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు శ్రీకరంబగు నిత్య

Post a Comment

కొత్తది పాతది