9

9

రాగం - కాంభోజి తాళం - ఆది

    ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని} 2
    ప్రతి దినము నిను ప్రచురపరచెద} 2
    ప్రభుడ నావిభుడా ||ప్ర||

  1. పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు
    మందమతి కా నందమొసగిన } 2
    మహిమతేజుడవు ||ప్ర||

  2. చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో
    స్వాంతమున కడు శాంతిగూర్చితి } 2
    వెంత కరుణదియో ||ప్ర||

  3. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే
    నీరసుడ నను గారవించిన } 2
    నీతిరాజితడే ||ప్ర||

  4. జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే
    జీవదాయక బ్రోవరా యిక } 2
    జాలమేలనురా ||ప్ర||

  5. నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను
    శమదమాది సుగుణశోభిత } 2
    సమ్మదిని నిమ్మా ||ప్ర||


    ✍ చెట్టి భానుమూర్తి

akk 9

Post a Comment

కొత్తది పాతది