3
రాగం - కాంభోజి తాళం - ఆది- రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుడ నీవెగా ||యేసు||
- హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు||
- కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునబెంచుము మాపాలకుడవో ||యేసు||
- మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||
- చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముడ నీ దయ మరువశక్యమా ||యేసు||
0 కామెంట్‌లు