697

4


    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
    అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్
    ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో
    ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని || అందాల ||

  1. విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను
    వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున
    విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో
    విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ || అందాల ||

  2. యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు
    ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి
    యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు || అందాల ||

  3. ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే
    బాలుని జూడ జీవితమంత - పావనమాయెను
    ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము
    బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన || అందాల ||


    Andhaala Thaara Arudhenche Naakai Ambara Veedhilo
    Avathaaramuurthi Yesayya Keerthin Avanichaatuchun
    Aanandha Sandhra Mupponge Naaloa Amara Kaanthilo
    Aadhi Dhevuni Juuda Aasimpa Manasu Payana Maithini || Andhaala Thaara ||

  1. Visvaasa Yaathra Dhuuramainantha –Vindhuga Dhoachenu
    Vinthaina Saanthi Varshinche Naaloa –Vijaya Padhamuna
    Visvaala Neledi Dheva Kumaaruni Veekshinchu Dheekshatho
    Virajimme Balamu Pravahinche Prema Visraanthinosaguchu || Andhaala Thaara ||

  2. Yerushalemu Rajanagarilo Yesuni Vedhakuchu
    Earigina Dhaari Tholagina Vela Yedhalo Krungithi
    Yesayya Thaara Yeppati Voale Yeduraaye Throavalo
    Entho Abbura Paduchu Vismaya Mondhuchu Yegithi Swami Kadaku || Andhaala Thaara ||

  3. Rabhu Janma Sthalamu Paakaye Gaani – Paraloaka Sowdhame
    Baaluni Juuda Jeevitha Mantha Paavana Maayenu
    Prabhu Paadha Puuja Dheevena Kaaga Prasarinche Punyamu
    Brathuke Mandhira Maaye Arpanale Sirulaaye Phaliyinche Praardhanaa || Andhaala Thaara ||

Post a Comment

కొత్తది పాతది