5
రాగం - కాంభోజి
తాళం - ఆది
నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుఁడి మీయాత్మతో నర్పించుడి } 2
దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుఁడి ||నీతి||
చదలఁ బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కఁగా } 2
సదమలంబగు దైవనామము
సర్వదా నుతిఁజేయను ||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు } 2
గర్వములు విడి తలలు వంచుచు
నుర్విలో నుతిఁజేయను ||నీతి||
గీత తాండవ వాద్యములచేఁ బ్రీతి పరచెడు సేవతో } 2
పాతకంబులు పరిహరించెడు
దాతనే సేవించుఁడి ||నీతి||
పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని } 2
పరము నందున్నట్టి యేసుని
పాదములు సేవింతురు ||నీతి||
ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని } 2
వెలయు స్తుతి వే నోళ్లతోడను
విసుగు జెందక జేయుడి ||నీతి||
ఆత్మ నీవిఁక మేలుకొని శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని } 2
త్రిత్వమగునా యేక దేవుని
హర్షమున సేవింపవే ||నీతి||
✍ పసుపులేటి దావీదు
కామెంట్‌ను పోస్ట్ చేయండి