హోమ్Purushotthamu.C 490 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట మా యేసు క్రీస్తుని మఱుగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా నగమ నెక్కెను రా ||మా యేసు||ముందు నాలో పాప ములు జూడ బడెరా డెందము తా నన్ని టిని నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మ జెందెనురా సందేహములు వీడు జాడ గన్గొనెరా ||మా యేసు||సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||బాధగురువుల మోము ల్బహు లజ్జబడెరా గాధ మంత్రము లన్ని కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి ప్రభుక్రీస్తు శరణు జొచ్చెనురా ||మా యేసు||మతిలోని లోతు మ ర్మము గానబడెరా మితలేని ఘనపాప మే నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుడురా మృతిచేత మన పాప వితతి గొట్టెనురా ||మా యేసు||కులగోత్రముల బుద్ధి కుటిలంబు దెగెరా బలవత్పిశాచ శృం ఖలము విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన నిలచి యున్నదిరా ||మా యేసు||తనపోల్కె నొరుల గ న్గొన బ్రేమయ్యెనురా మనసు దేవునికి న ర్పణ సేయ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు|| ✍ పురుషోత్తము చౌధరి Maa Yesu Kreesthuni – Marugu Galgenu Raa= Naa Yaathma Ghana Rakshaa- Nagama Nekkenu Raa || Maa Yesu || Mundhu Naaloa Paapa- Mulu Juuda Baderaa Dendhamu Thaa Nanni- Tini Noppukoneraa = Andhukai Palu Dhukkamaathma Chendhenuraa – Sandhehamulu Veedu – Jaada Kangoneraa || Maa Yesu || Suvisesha Boadhanaa –Chevu Laalinchenuraa –Naviveka Saasthroakthu – Lantuveedenuraa – Nava Sathkraisthava Goashti – Bhuvi Naa Kabbenuraa – Vividhamulagu Velpu –Lvishamairi Gadhaa || Maa Yesu || Baadha Guruvula Moamu – Lbahu Lajjambaderaa – Gaadha Manthramu Lanni Kadagandlayi Chederaa = Soadhinchi Naa Yaathma – Sudhdhi Goarenuraa – Saadhinchi Prabhu Kreesthu Saranu Jochchenuraa || Maa Yesu || Mathi Loani Loathu Ma- Rmamu Gaana Baderaa – Mithi Leni Ghana Paapa – Me Nindu Koneraa= Hithamugaa Thana Jeeva – Michche Kreesthudu Raa – Mruthi Chetha Mana Paapa – Vithathi Gottenuraa || Maa Yesu || Kula Goathramula Budhdhi Kutilambu Thegeraa- Bala Vath Pisaacha Srukalamu Virigenuraa = Siluva Moasina Vaani – Chira Sowkhoannathiraa – Nelavuga Naaloana Nilachi Yunnadhiraa || Maa Yesu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి