హోమ్Purushotthamu.C 178 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఆ యంధకారంపు రేయిలో క్రీస్తు పడు నాయాసములు దలఁచరే సాయంతనము శిష్య నమితితో భోజనముఁ జయఁగూర్చున్న ప్రభువు భక్తుల కనియె ||నా యంధ|| ఒకఁడు మీలో నన్ను యూద గణముల చేత లకు నప్పగింపఁ దలఁ చెన్ మొక మిచ్చకము గల్గు మూర్ఖుఁడగు యూదాను మొనసె వీడనుచుఁ దెలిపి యికఁ మిమ్ముఁగూడియుం డకయుందునని రొట్టె విరిచి స్తోత్రంబుజేసి ప్రకటంబుగా దీని భక్షించుఁడని పిదప నొక పాత్ర నాన నిచ్చెన్ ద్రాక్షారసం ||బా యంధ|| తన మేని గురుతు రొ ట్టెను జేసి పాపవిమో చనమైన రక్తమునకు నొనరంగ ద్రాక్షారస మును గురుతుగాఁ దెలిపి నెనరుగల కర్త యపుడు చనె గెత్సెమను వన స్థలిలోన శిష్యుల నునిచి తానొక్కరుండు మనసు వ్యాకులము చే తను నిండియుండఁగా ఘనుడు ప్రార్ధించెఁదండ్రిన్ గాఢముగాను ||ఆ యంధ|| శ్రమచేతఁ దన శరీ రము నుండి దిగజారెఁ జెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపా పముఁ జూచి నిట్టూర్పులప్పటప్పటికిఁ బుచ్చి క్రమముగా దూత తన కడ కరుగుదెంచి శాం తముఁ బల్కి చనిన పిదపం తమ మనంబులఁ బోలు తమసమున యూద సై న్యము లేగుదెంచె నపుడు గెత్సెమను పనికి ||నా యంధ|| పరశాంతి శీల స ర్వజ్ఞతలు గల ప్రభుం డెరిఁగి తనకున్న పాట్లు పరిపంధి గణముతోఁ బలికె మీరిచ్చోట నరయుచున్నా రెవనిని నరులు నజరేతు యే సను వాని ననఁగఁ దా నెఱిఁగించె నేనేయని గురుదీప శిఖల సో కు పతంగముల భంగి ధరణిపైఁ బడిరి వారల్ దర్పము లణఁగి ||యా యంధ|| తన శిష్యులను విడువుఁ డని రిపులచేఁ దానె పట్టువడియెన్ కినిపి పేతురు యాజ కుని దాసు కర్ణంబు దునుమంగ క్రీస్తుఁడపుడు కనికరంబున స్వస్థ తను జేయు నావిభుని కరములను విరిచి కట్టి వెనుక ముందరఁ జుట్టు కొని యెరూషలేము పుర మునకుఁ దీనుకఁ బోయిరి రాణువవార ||లా యంధ|| ✍ పురుషోత్తము చౌధరి Aa Yandha Kaarampu –Reyilo Kreesthu Padu- Aayaasamulu Thalachare = Saayantha Namu Sishya – Samithithoa Bhoajanamu – Cheya Kuurchunna Prabhuvu – Bhakthula Kaniye || Na Yandha || Okadu Meeloa Nannu- Yuudha Ganamula Chethu – Laku Nappa Gimpa Thalachen – Moka Michchakamu Kalgu – Muurkhudagu Yuudhaanu – Monase Veedanychu Thelipi Yika Mimmu Guudi Yun- Daka Yundhunani Rotte – Virichi Sthoathrambu Chesi = Prakatambugaa – Dheeni Bhakshin Chudani Pidhapa – Noka Paathra Nana Nicchchen – Dhraakshaa Rasam || Ba Yandha || Thana Meni Guruthu Ro- Ttenu Chesi Paapa Vimoa- Cha Namaina Rakthamunaku – Nonaranga Dhraakshaa Rasa-Munu Guruthugaa Thelipi – Nenaru Gala Kartha Yapudu – Chane Gethsamanu Vana –Sthali Loana Sishyula – Nunichi Thaa Nokkarundu = Manasu Vyaakulamuche – Thanu Nindi Yundagaa–Ghanudu Praardhinche Thandrin-Gaadamugaanu || Aa Yandha || Srama Chetha Thana Sareeramu Nundsi Dhiga Jaare – Che Mata Rakthapu Botlugaa – Namithamou Loaka Paa – Pamu Juuchi Nittuurpu Lappa Tappatiki Buchchi – Kramamugaa Dhuutha Thana – Kada Karugu Dhenche Saam- Thamu Paliki Chanina Pidhapa = Thama Manambula Boalu – Thamasamu Na Yuudha Sai – Nyamu Legu Dhenche Napudu- Gethsama Nu Vaniki || Naa Yandha || Para Saanthi Seela Sa-Rvajnathalu Gala Prabhun –Derigi Thana Kunna Paatlu – Pari Pandhi Ganamuthoa – Palike Mee Richchoata– Narayu Chunnaaa Revanini – Narulu Najarethu Ye – Sanu Vaani Nanaga Dhaa – Neriginche Neneyani- Guru Dheepa Sikhala Soa-Ku Pathanga Mula Bhangi– Dharani Pai Badiri Vaaral – Dharpamu Lanagi || Ya Yandha || Thana Sishyulanu Viduvu – Dani Ripulache Thane Pattu Vadiyen – Kinipi Pethuru Yaaja – Kuni Dhaasu Karnambu – Dhunumanga Kreesthudapudu – Kanikarambuna Svastha –Thanu Cheyu Naa Vibhuni – Karamulanu Virachi Katti = Ve Nuka Mundhara Juttu – Koni Yeruushalemu Pura–Munaku Theesuka Poayiri – Raanuva Vaara || La Yandha || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి