హోమ్Purushotthamu.C 150 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ జిత్రమొక్క పని వచించెద ||వినరె||మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు ||వినరె||ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు వాసముండి రెలమితోడను ||వినరె||పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు రోగ భరితుఁడయ్యెను ||వినరె||వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి రపుడు నాతు లిరువురు ||వినరె||తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ డరిగె నచటికి ||వినరె||యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను ||వినరె||కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని కతన వ్రాలె లాజరు ||వినరె||పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట మార్త పలికినట్లు సుదతి పలికెను ||వినరె||అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు రాలితోడ నపుడు నడిచెను ||వినరె||నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను ||వినరె||యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ గంపు పట్టి యుండదా ||వినరె||దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను ||వినరె||లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా రవంబుఁ బూని పల్కెను ||వినరె||మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక హర్షలైరి పెదజనంబుతో ||వినరె||కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు యేసునాధు ననుసరించిరి ||వినరె||కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు నిలిపి యతనియందు మనుట మేలగున్ ||వినరె|| ✍ పురుషోత్తము చౌధరి Vinare Manuju Laara Kreesthudi -Lanu Cheyu Ghanamu Laina = Panula Loana Chithra Mokka – Pani Vachinchedha Vinare Manuju Laara || Vinare || Mana Manambu Lalaru Chunda – Dhinadhinambu Prabhuni Nindu = Ghana Mahaadhbhu Thamulu Vinina – Thanivi Theeradhu Vinare Manuju Laara || Vinare || Eilanu Bethaniya Purambu – Kaladhu Mariya Maartha Lakka = Cheliyalandhu Vaasamundi Relami Thoadanu Vinare Manuju Laara || Vinare || Parimalampu Thailamesu – Charanamulaku Puusina Eee = Mariya Soadharundu Roaga – Bharithudayyenu Vinare Manuju Laara || Vinare || Vyaadhi Chetha Laazarundu – Baadha Nondhu Chunda Kreesthu = Naadhu Piluva Nampi Rapudu – Naathu Liruvuru Vinare Manuju Laara || Vinare || Thammu Dakka Cheliyalunu Pri – Yammu Thanaku Kaligi Yunda = Ammahaathmudaina Kreesthu Darige Nachatiki Vinare Manuju Laara Vinare Manuju Laara || Vinare || Yesu Vachchu Terigi Maartha – Yedhuru Gaanu Thanadhu = Dhoasi Loggi Mrokki Prabhuvu – Thoada Palkenu Vinare Manuju Laara || Vinare || Kartha Neeku Dhevu Dichchu – Ghana Bala Merugudhunu Sathya Varthi Vichata Leni Kiathana – Vraale Laazaru Vinare Manuju Laara || Vinare || Pidhapa Mariya Vachchi Kreesthu – Padha Yugamuna Korigi Yedchi = Modhata Maartha Paliki Natulu – Sudhathi Palikenu Vinare Manuju Laara || Vinare || Apudu Kartha Vaari Palukul – Aalakinchi Madhini Muulgi = Krupaku Paathru Raali Thoada – Apudu Nadachenu Vinare Manuju Laara || Vinare || Nadichi Laajaruni Samaadhi - Kadaku Jeri Guhanu Muuya = Badina Raayi Theeyu Danuchu Ptrabhuvu Cheppenu Vinare Manuju Laara || Vinare || Yesu Thoada Maartha Palike Eee Samaadhi Nunchi Naalgu = Vaasarambu Layye Kampu – Patti Yundadhaa Vinare Manuju Laara || Vinare || Dhaani Nammi Chuudu Mani Ma – Haanubhaavu Daathma Balamu = Nuuni Thandri Kapudu Sthoathra Monara Jesenu Vinare Manuju Laara || Vinare || Laazaru Samaadhi Nedali – Rammu Lemmatanchu Loaka = Puujithudu Mahaa Ravambu Puuni Palkenu Vinare Manuju Laara || Vinare || Marana Maina Vaadu Praana – Bharithudaguchu Lechi Vachche – Tharunu Ladhika Harshalairi – Pedha Janambuthoa Vinare Manuju Laara || Vinare || Kana Vinanga Raani Yitti – Ghana Mahaadhbhuthambu Chuuchi = Janulu Kreesthu Yesu Naadhu – Nanusarinchiri Vinare Manuju Laara || Vinare || Kanuka Manamu Vaani Jeru – Koni Sukhambu Badaya Vachchu = Manasu Nilipi Athani Yandhu –Manuta Melagun || Vinare || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి