హోమ్Purushotthamu.C 138 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు||భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు||పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు|| ✍ పురుషోత్తము చౌధరి Yesu Naamame Paavanamu- Maaku Yesu Gadha Nithya Jeevanamu – Dhaasa Jana Hrudvikaasa Maiyella – Dhoasamulaku Vi-Naasakaramaina || Yesu || Saadhu Maanasoallaasamulu Yesu – Naadhu Guna Chidhvilaasamulu = Boadha Gonu Vaari –Baadha Vedalinchi – Maadhurya Magu Mukthi –Saadhanamu Licchu || Yesu || Bhaktha Jana Loaka Puujyamulu Raktha – Siktha Paadha Payoajamulu = Muktha Raajyaabhi – Shikthudow Sarva –Sakthi Yuthudaina Saami Yagu Kreesthu || Yesu || Dheena Jana Nithya Thoashanamu– Silva- Mraani Prabhu Mruthyu Ghoashanamu = Paana Kamu Junti –Theniyala Svaadhu – Veenulanu Groalu – Maanavula Kella || Yesu || Paapulaku Manchi Pakshamulu – Mukthi Juupu Kreesthu Kataakshamulu = Papa San Dhoaha – Kuupamuna Guulu – Kaapurushu Nannu Gaachu Koni Broachu || Yesu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి