నాలోని రూపమా నా మెస్సయ్యా
నా జీవ నావ నడిపే నావికుడు నీవేగా
నా హృదయమందు నిలిచే ఆరాధ్య దైవమా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
1) నీవు లేని జీవితం అదియే శూన్యము (2)
నీది కాని ఏ దారైనా అగమ్యగోచరం (2)
సృష్టియందేదైనా నీ ఆజ్ఞ మీరేనా (2)
నీకు వేరుగా ఇలలో మనుగడే లేదుగా
నా ప్రాణ దీపమా నా యేసయ్యా నాలోని రూపమా నా మెసయ్యా
2) నీదు కృప నిల కురిపించి నను ప్రేమించితివి (2)
నాకై ప్రాణం పెట్టిన కారుణ్య మూర్తివి (2)
ఏమిచ్చి నీ రుణం తీర్చగలనో ప్రభువా (2)
నీ చిత్తమందు నిలిచే నీరీక్షణ నొసగుమా
నా ప్రాణ దీపమా నా యేసయ్యా
నాలోని రూపమా నా మెస్సయ్యా
నా జీవ నావ నడిపే నావికుడు నీవేగా
నా హృదయమందు నిలిచే ఆరాధ్య దైవమా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన