Raksha naa vandhanalu sree rakshaka naa vandhanalu రక్షకా నా వందనాలు శ్రీరక్షకా నా వందనాలు

Song no: 29

    రక్షకా నా వందనాలు - శ్రీరక్షకా నా వందనాలు

  1. ధరకు రాకముందె భక్త - పరుల కెరుకైనావు || రక్షకా ||

  2. ముందు జరుగు నీ చరిత్ర - ముందె వ్రాసిపెట్టినావు || రక్షకా ||

  3. జరిగినపుడు చూచి ప్రవ - చనము ప్రజలు నమ్మినారు || రక్షకా ||

  4. నానిమిత్తమై నీవు - నరుడవై పుట్టినావు || రక్షకా || - (లూకా 2 అ)

  5. మొట్టమొదట సాతాను - మూలమూడ గొట్టినావు || రక్షకా || - (మత్తయి4:10)

  6. పాపములు పాపముల - ఫలితములు గెలిచినావు || రక్షకా || - (1పేతురు 2:21-23)

  7. నీవె దిక్కు నరులకంచు - నీతిబోధ చేసినావు || రక్షకా || - (యోహాను 14:10)

  8. చిక్కుప్రశ్న లాలకించి - చిక్కుల విడదీసినావు || రక్షకా || - (మత్తయి 22:21)

  9. ఆకలిగలవారలకు - అప్పముల్ కావించినావు || రక్షకా || - (యోహాను 6:12)

  10. ఆపదలోనున్న వారి - ఆపద తప్పించినావు || రక్షకా || - (మత్తయి 8:26)

  11. జబ్బుచేత బాధనొందు - జనుని జూడ జాలినీకు || రక్షకా || - (మత్తయి 9:36)

  12. రోగులను ప్రభావముచే - బాగుచేసి పంపినావు || రక్షకా || - (మార్కు 5:30)

  13. మందు వాడకుండ జబ్బు - మాన్పి వేయగలవు తండ్రి || రక్షకా || - ( మార్కు 2:12)

  14. వచ్చినవారందరికి - స్వస్థత దయ చేయుదువు || రక్షకా || - (మార్కు 1:32,33)

  15. అప్పుడును యిప్పుడును - ఎప్పుడును వైధ్యుడవు || రక్షకా || - (హెబ్రీ 13:8)

  16. నమ్మలేని వారడిగిన - నమ్మిక గలిగింపగలవు || రక్షకా || - (మార్కు9:24)

  17. నమ్మగలుగు వారి జబ్బు - నయముచేసి పంపగలవు || రక్షకా || - (మత్తయి 9:29)

  18. రోగిలోని దయ్యములను - సాగదరిమి వేసినావు || రక్షకా || - (మత్తయి 17:18)

  19. దయ్యముపట్టినవారి - దయ్యమును దరిమినావు || రక్షకా || - (మార్కు 5:13)

  20. బ్రతుకు చాలించుకొన్న - మృతులను బ్రతికించినావు || రక్షకా || - (లూకా 7:15)

  21. పాపులు సుంకరులు ఉన్న - పంక్తిలో భుజించినావు || రక్షకా || - (లూకా 15:2)

  22. మరల నీవు రాకముందు - గురుతు లుండునన్నావు || రక్షకా || - (మత్తయి 24 అధ్యా)

  23. చంపుచున్న శత్రువులను - చంపక క్షమించినావు || రక్షకా || - (లూకా 23:34)

  24. రాకవెన్క అధికమైన - శ్రమలు వచ్చునన్నావు || రక్షకా || - (మత్తయి 24:21)

  25. క్రూరులు చంపంగ నా - కొరకు మరణమొందినావు || రక్షకా || - (థెస్స 5:10)

  26. పాపములు పరిహరించు - ప్రాణరక్తమిచ్చినావు || రక్షకా || - (యోహాను 19:34; మత్తయి 27:50)

  27. పాపభారమెల్లమోసి - బరువు దించివేసినావు || రక్షకా || - (యెషయి 53 అధ్యా)

  28. వ్యాధిభారమెల్ల మోసి - వ్యాధి దించివేసినావు || రక్షకా || - (యెషయి 53)

  29. శిక్షభారమెల్లమోసి - శిక్షదించివేసినావు || రక్షకా || - (యెషయి 53)

  30. మరణమొంది మరణభీతి - మరలకుండ జేసినావు || రక్షకా || - (హెబ్రీ 2:14)

  31. మరణమున్ జయించిలేచి - తిరిగి బోధజేసినావు || రక్షకా || - (అపో.కా.1:3)

  32. నిత్యము నాయొద్దనుండ - నిర్ణయించుకొన్నావు || రక్షకా || - (మత్తయి 28:20)

  33. సృష్టికి బోధించుడని - శిష్యులకు చెప్పినావు || రక్షకా || - (మార్కు 16:15)

  34. నమ్మి స్నానమొందరక్ష - ణంబు గల్గునన్నావు || రక్షకా ||

  35. దీవించి శిష్యులను - దేవలోకమేగినావు || రక్షకా || - ( లూకా 24:51)

  36. నరకము తప్పించి మోక్ష - పురము సిద్ధపరచినావు || రక్షకా || - (యోహాను 14:3; ప్రకటన 20:14)

  37. మహిమగల బ్రతుకునకు - మాదిరిగా నడచినావు || రక్షకా || - (యోహాను 8:54; 1పేతురు 2:21)

  38. దేవుడని నీ చరిత్ర - లో వివరము చూపినావు || రక్షకా || - (యోహాను 20:28; రోమా 9:5)

  39. త్వరగావచ్చి సభను మోక్ష - పురము కొంచుపోయెదవు || రక్షకా || - (యోహాను 14:3)

  40. నేను చేయలేనివన్ని - నీవె చేసి పెట్టినావు || రక్షకా || - (1తిమోతి 1:15)

  41. యేసుక్రీస్తు ప్రభువ నిన్ను - యేమని స్తుతింపగలను || రక్షకా || - (1తిమోతి 1:15)

  42. బైబిలులో నిన్ను నీవు - బయలుపర్చుకొన్నావు || రక్షకా || - (లూకా 24:44)

  43. భూమిచుట్టు సంచరించు - బోధకులను పంపినావు || రక్షకా || - (అపో.కా. 1:8)

  44. సర్వదేశాలయందు - సంఘము స్థాపించినావు || రక్షకా || - (సంఘ చరిత్ర)

  45. అందరకు తీర్పు రాక - ముందే బోధచేసెదవు || రక్షకా || - (మత్తయి 7:22;ప్రకటన 20:1)

  46. పెండ్లి విందునందు వధువు - పీఠము నీచెంతనుండు || రక్షకా ||

  47. ఏడేండ్ల శ్రమలయందు - ఎందరినో త్రిప్పెదవు || రక్షకా ||

  48. హర్మగెద్దోను యుద్ధమందు - ధ్వజము నెత్తెదవు || రక్షకా ||

  49. నాయకులను వేసెదవు - నరకమందు తత్ క్షణంబె || రక్షకా ||

  50. సాతానును చెర - సాలలో వేసెదవు || రక్షకా ||

  51. వసుధమీద వెయ్యి సం - వత్సరంబులేలెదవు || రక్షకా ||

  52. కోట్లకొలది ప్రజలను సమ - కూర్చి రక్షించెదవు || రక్షకా ||

  53. వెయ్యి యేండ్లు నీ సువార్త - విన్న వారికుండు తీర్పు || రక్షకా ||

  54. పడవేతువు సైతానున్ - కడకు నగ్నిగుండమందు || రక్షకా ||

  55. కడవరి తీర్పుండు నంత్య - కాలమందు మృతులకెల్ల || రక్షకా ||

  56. నీకును నీ సంఘమునకు - నిత్యమును జయము జయము || రక్షకా ||

  57. నీకును నీ శ్రమలకును నిత్యమును - జయముజయము || రక్షకా ||

  58. నీకును నీ నిందలకును - నిత్యమును జయముజయము || రక్షకా ||

  59. నీకును నీ బోధకును - నిత్యమును జయముజయము || రక్షకా ||

  60. నీకును నీ పనులకును - నిత్యమును జయముజయము || రక్షకా ||

  61. నీకును నీ కార్యములకు - నిత్యమును జయముజయము || రక్షకా ||

  62. నీకును నీ సేవకులకు - నిత్యమును జయముజయము || రక్షకా ||

  63. నీకును నీ రాజ్యమునకు - నిత్యమును జయముజయము || రక్షకా ||





raagaM: jaMjhooTi taaLaM: tisrachaapu



    rakshakaa naa vaMdanaalu - Sreerakshakaa naa vaMdanaalu

  1. dharaku raakamuMde bhakta - parula kerukainaavu || rakshakaa ||

  2. muMdu jarugu nee charitra - muMde vraasipeTTinaavu || rakshakaa ||

  3. jariginapuDu choochi prava - chanamu prajalu namminaaru || rakshakaa ||

  4. naanimittamai neevu - naruDavai puTTinaavu || rakshakaa || - (lookaa 2 a)

  5. moTTamodaTa saataanu - moolamooDa goTTinaavu || rakshakaa || - (mattayi4:10)

  6. paapamulu paapamula - phalitamulu gelichinaavu || rakshakaa || - (1paeturu 2:21-23)

  7. neeve dikku narulakaMchu - neetibOdha chaesinaavu || rakshakaa || - (yOhaanu 14:10)

  8. chikkupraSna laalakiMchi - chikkula viDadeesinaavu || rakshakaa || - (mattayi 22:21)

  9. aakaligalavaaralaku - appamul^ kaaviMchinaavu || rakshakaa || - (yOhaanu 6:12)

  10. aapadalOnunna vaari - aapada tappiMchinaavu || rakshakaa || - (mattayi 8:26)

  11. jabbuchaeta baadhanoMdu - januni jooDa jaalineeku || rakshakaa || - (mattayi 9:36)

  12. rOgulanu prabhaavamuchae - baaguchaesi paMpinaavu || rakshakaa || - (maarku 5:30)

  13. maMdu vaaDakuMDa jabbu - maanpi vaeyagalavu taMDri || rakshakaa || - ( maarku 2:12)

  14. vachchinavaaraMdariki - svasthata daya chaeyuduvu || rakshakaa || - (maarku 1:32,33)

  15. appuDunu yippuDunu - eppuDunu vaidhyuDavu || rakshakaa || - (hebree 13:8)

  16. nammalaeni vaaraDigina - nammika galigiMpagalavu || rakshakaa || - (maarku9:24)

  17. nammagalugu vaari jabbu - nayamuchaesi paMpagalavu || rakshakaa || - (mattayi 9:29)

  18. rOgilOni dayyamulanu - saagadarimi vaesinaavu || rakshakaa || - (mattayi 17:18)

  19. dayyamupaTTinavaari - dayyamunu dariminaavu || rakshakaa || - (maarku 5:13)

  20. bratuku chaaliMchukonna - mRtulanu bratikiMchinaavu || rakshakaa || - (lookaa 7:15)

  21. paapulu suMkarulu unna - paMktilO bhujiMchinaavu || rakshakaa || - (lookaa 15:2)

  22. marala neevu raakamuMdu - gurutu luMDunannaavu || rakshakaa || - (mattayi 24 adhyaa)

  23. chaMpuchunna Satruvulanu - chaMpaka kshamiMchinaavu || rakshakaa || - (lookaa 23:34)

  24. raakavenka adhikamaina - Sramalu vachchunannaavu || rakshakaa || - (mattayi 24:21)

  25. kroorulu chaMpaMga naa - koraku maraNamoMdinaavu || rakshakaa || - (thessa 5:10)

  26. paapamulu parihariMchu - praaNaraktamichchinaavu || rakshakaa || - (yOhaanu 19:34; mattayi 27:50)

  27. paapabhaaramellamOsi - baruvu diMchivaesinaavu || rakshakaa || - (yeshayi 53 adhyaa)

  28. vyaadhibhaaramella mOsi - vyaadhi diMchivaesinaavu || rakshakaa || - (yeshayi 53)

  29. SikshabhaaramellamOsi - SikshadiMchivaesinaavu || rakshakaa || - (yeshayi 53)

  30. maraNamoMdi maraNabheeti - maralakuMDa jaesinaavu || rakshakaa || - (hebree 2:14)

  31. maraNamun^ jayiMchilaechi - tirigi bOdhajaesinaavu || rakshakaa || - (apO.kaa.1:3)

  32. nityamu naayoddanuMDa - nirNayiMchukonnaavu || rakshakaa || - (mattayi 28:20)

  33. sRshTiki bOdhiMchuDani - Sishyulaku cheppinaavu || rakshakaa || - (maarku 16:15)

  34. nammi snaanamoMdaraksha - NaMbu galgunannaavu || rakshakaa ||

  35. deeviMchi Sishyulanu - daevalOkamaeginaavu || rakshakaa || - ( lookaa 24:51)

  36. narakamu tappiMchi mOksha - puramu siddhaparachinaavu || rakshakaa || - (yOhaanu 14:3; prakaTana 20:14)

  37. mahimagala bratukunaku - maadirigaa naDachinaavu || rakshakaa || - (yOhaanu 8:54; 1paeturu 2:21)

  38. daevuDani nee charitra - lO vivaramu choopinaavu || rakshakaa || - (yOhaanu 20:28; rOmaa 9:5)

  39. tvaragaavachchi sabhanu mOksha - puramu koMchupOyedavu || rakshakaa || - (yOhaanu 14:3)

  40. naenu chaeyalaenivanni - neeve chaesi peTTinaavu || rakshakaa || - (1timOti 1:15)

  41. yaesukreestu prabhuva ninnu - yaemani stutiMpagalanu || rakshakaa || - (1timOti 1:15)

  42. baibilulO ninnu neevu - bayaluparchukonnaavu || rakshakaa || - (lookaa 24:44)

  43. bhoomichuTTu saMchariMchu - bOdhakulanu paMpinaavu || rakshakaa || - (apO.kaa. 1:8)

  44. sarvadaeSaalayaMdu - saMghamu sthaapiMchinaavu || rakshakaa || - (saMgha charitra)

  45. aMdaraku teerpu raaka - muMdae bOdhachaesedavu || rakshakaa || - (mattayi 7:22;prakaTana 20:1)

  46. peMDli viMdunaMdu vadhuvu - peeThamu neecheMtanuMDu || rakshakaa ||

  47. aeDaeMDla SramalayaMdu - eMdarinO trippedavu || rakshakaa ||

  48. harmageddOnu yuddhamaMdu - dhvajamu nettedavu || rakshakaa ||

  49. naayakulanu vaesedavu - narakamaMdu tat^ kshaNaMbe || rakshakaa ||

  50. saataanunu chera - saalalO vaesedavu || rakshakaa ||

  51. vasudhameeda veyyi saM - vatsaraMbulaeledavu || rakshakaa ||

  52. kOTlakoladi prajalanu sama - koorchi rakshiMchedavu || rakshakaa ||

  53. veyyi yaeMDlu nee suvaarta - vinna vaarikuMDu teerpu || rakshakaa ||

  54. paDavaetuvu saitaanun^ - kaDaku nagniguMDamaMdu || rakshakaa ||

  55. kaDavari teerpuMDu naMtya - kaalamaMdu mRtulakella || rakshakaa ||

  56. neekunu nee saMghamunaku - nityamunu jayamu jayamu || rakshakaa ||

  57. neekunu nee Sramalakunu nityamunu - jayamujayamu || rakshakaa ||

  58. neekunu nee niMdalakunu - nityamunu jayamujayamu || rakshakaa ||

  59. neekunu nee bOdhakunu - nityamunu jayamujayamu || rakshakaa ||

  60. neekunu nee panulakunu - nityamunu jayamujayamu || rakshakaa ||

  61. neekunu nee kaaryamulaku - nityamunu jayamujayamu || rakshakaa ||

  62. neekunu nee saevakulaku - nityamunu jayamujayamu || rakshakaa ||

  63. neekunu nee raajyamunaku - nityamunu jayamujayamu || rakshakaa ||

أحدث أقدم