Lokamunu vidichi vellavalenuga sarvamicchutane లోకమును విడచి వెళ్ళవలెనుగ సర్వమిచ్చటనే విడువవలెన్

Song no: 735
"నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము." హెబ్రీ Hebrews 13:14
    పల్లవి : లోకమును విడచి వెళ్ళవలెనుగ
    సర్వమిచ్చటనే విడువవలెన్

  1. యాత్రికులము యీ దుష్టలోకములో
    పాడులోకములో మనకేది లేదు
    యే విషయమందైన గర్వించలేము
    జాగ్రత్తగానే నడచుకొనెదము || లోకమును ||

  2. కష్ట బాధలచే బ్రతుకంత నిండె
    కన్నీళ్ళు నిరాశ నిస్పృహల మయము
    కరుణా కటాక్షము నమ్మెదము
    క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము || లోకమును ||

  3. ఎంత వరకు యీ భువి యందుండెదమో
    సైతానుతో సదా పోరాటమేగా
    శత్రుని తంత్రాల నెరిగితిమి
    ధైర్యముతోనే కొనసాగెదము || లోకమును ||

  4. గతము నంతటిని మరచిపోయెదము
    గురియొద్ద కానందముతో వెళ్ళెదము
    మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి
    అర్హులమౌదము బహుమానమొంద || లోకమును ||

  5. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి
    నిజ ప్రేమతోనే జీవించెదము
    నిష్కళంకులమై శుద్ధులమై
    పరిపూర్ణతను చేపట్టుదము || లోకమును ||

  6. జీవము గల ప్రభు రక్షించె మనల
    విమోచించి నూతన జీవమొసగ
    కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్
    అందుచే మనము సిద్ధపడెదము || లోకమును ||

  7. ఆత్మీయ నేత్రాలతో చూచెదము
    ఎంత అద్భుతము సౌందర్య నగరం
    ప్రభువు చెంతకు వెళ్ళెదము
    విజయోత్సవముతో ప్రవేశించెదము || లోకమును ||

Post a Comment

أحدث أقدم