నాయకుడవు నీవు - క్రీస్తు సేవకుడవు నీవు
మాదిరికరము అనేకులకు - నీ జీవితం (4)
నిలిచే శిఖరమై నడిచే సైన్యమై - రగిలే జ్వాలవై వెలిగే జ్యోతివై (2)
మాదిరికరముగా మాకు తోడుగా - మమ్మును నడిపిన నీవే
మా అన్నగ తండ్రిగ మాకు అండగా - మాతో ఉన్నది నీవే (2)
సేవలో నలుగుతూ నవ్వుతూ భోదిస్తూ కడుగుతూ వెలిగించే దీపమా (2)
గతిలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే (2)
మా కష్టాలలో నష్టాలలో మాకై ప్రార్థించావే
మా జీవితాలు ప్రభు చిత్తమేమిటో గ్రహియింపజేసావే
మేమంతా నీతోనే మా అడుగు నీతోనే (2)
ప్రార్ధనే స్నేహమై వాక్యమే ప్రాణమై జీవించే కాపరివి నీవయా
ప్రభువే ఇష్టమై ఆత్మలే ముఖ్యమై సేవించే కాపరి నీవయా
మా ఆకలి మంటలో అన్నం పెట్టిన అన్న దాతవు నీవే
( అలుపేలేని నీ సేవను చేస్తూ మా ఆదర్శంగా నిలిచావు)
నిరుపెదలెందరికో చేయూత నిస్తూ క్రీస్తు ప్రేమ కనపరచావే
జీవించు చిరకాలం బ్రతికించు కలకాలం ||2||
إرسال تعليق