నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి (2)
నా మంచి కాపరి నా యేసయ్య (2)
నను నీ మార్గములో నడిపించుచుంటివి (2) " నా మంచి"
నీదు సమరూపమే నేను ఆశించితిని నా ఆశలన్నీ నీవే తీర్చితివి (2)
నా ఎదుట ద్వారములు తెరిచితివి (2)
ముగింపువరకు నను నడిపితివి (2) "నా మంచి"
నీవు జయించిన వారికి నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
నిత్యమూ నీ సన్నిధిలో నివసించుటకై (2) "నా మంచి"
నిత్య సీయోనులో నేను నివసించుటకై పరదేశిగా ఇలలో జీవించుచుంటిని (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
గొర్రెపిల్ల సముఖములో నేనుండుటకై (2) "నా మంచి"
నీదు గాయాలలోనే నాకు నెమ్మది నీదు రక్తములోనే కడుగబడితిని (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
నీదు స్వస్థతను అనుభవించితిని (2)
إرسال تعليق