Yennenno kalalu kanna na chinni thanaya ఎన్నెన్నో కలలు కన్న నా చిన్ని తనయ

ఎన్నెన్నో కలలు కన్న - నా చిన్ని తనయ
ఆశలెన్నో పెట్టుకున్న - ఓ ప్రియ తనయ
నీవేగా నాప్రాణం - నీవేగా నా లోకం
నీవేగా నా రూపం - నా కన్నా

పిలిచినా ఎంత పిలిచినా పలుకవే - బదులివ్వవే ||2||
ప్రేమించే తండ్రిపై - కోపము తగునా
కాక్షించే కళ్లకే - కన్నీళ్లే మిగిలేనా
గునపాలు గుచ్చకయా - నా గుండెలో
గాయాలు చేయకయ్యా ||2||

వేదకినా ఎంత వేదకినా దొరకవే నాకు దొరకవే
నా కన్నా నీకున్న - స్నేహమే ముఖ్యమా
ఈలోక పాపమే - నాకన్న సౌఖ్యమా
నన్నెడిపించకయా - నా నాయన
నా చెంత చేరుమయ్యా ||2||

Post a Comment

أحدث أقدم