Kamandhula kasithananiki baliavuthundhi pasithanam కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం

    కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం..
    రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం... "2"
    కడుపురగిలి క్షుద్బాదను తట్టుకునే జీవనం.
    గుండెపగిలి గొంతుఎండి అడుగుతుంది కారణం
    సమాజాన్ని ప్రశ్నించే చిన్నతనం
    ఈ సమాజానికె ఎంతో చిన్నతనం...

  1. ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే..
    దిక్కులేనివారికి దారిచూపనోడురా అనాథ అంటే..
    కడుపులు చేసినోళ్ళురా..కనిపారేసినోళ్ళురా...
    కరుణేలేనివాళ్ళురా అనాథలు..
    మనసే లేనివాళ్ళురా..మనిషిగా బ్రతుకనోళ్ళురా..
    జాలే లేని రాళ్ళురా అనాధలు
    దోచుకున్న వాళ్ళకి తొడబుట్టినోళ్ళురా అనాథలంటే
    దైవాభీతి ఎరుగని నీతిలేని జనమురా అనాథలంటే

  2. పానుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు..
    వీదులలోన ఒంటరితనాన పెరిగెను ఓ అనాథ చెట్టు...
    జాలిలేని కళ్లు అన్ని చూసి విడిచిపోతుంటే
    మనపిల్లలు కాదుగదా మనకెందుకు అనుకుంటే
    దిక్కులేని పసికందులు గుక్కపెట్టి ఏడుస్తూ శోకంతోరాసుకున్న శోక్షమిదే అమ్మా - నాన్నలేని అనాథ ఎవరు?
    రాళ్లు రప్పలు కలిస్తే పుడతాడావాడు?
    క్షణికావేశపు కామం కొందరిదీ..
    జీవిత కాలపు క్షామం ఎందరిదీ..
    బీదల చావు కేకకి.. ఎగిరిన ఎంగిలాకురా అనాథ అంటే..
    పెద్దల పాశవికతకి అల్పుల నిష్పహాయతరా అనాథ అంటే...

  3. పాముకు పాలు పోసేభక్తులు. బీదలకు ఇవ్వరు చన్నీళ్ళు..
    గుళ్లకు లక్షలు ఆర్భాటాలు‌ అనాథ బ్రతుకులేమో బుగ్గిపాలు...
    దీనహీనులైన సాటి మనుషులని
    కనికరించి
    ఆదుకునే నాదులుగా  మీవంతుగా సాయపడితే
    పాలబుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే..
    భక్తి జీవితపు కొలమానం అదేకదా.......... గర్భం దాల్చి కన్నవాళ్లే పిల్లలూ...
    మానవతతో కన్నవాళ్ళు మనపిల్లలుకారా?
    జాలి అనే నీ కడుపు పండాలి .. ప్రేమ గర్భముందు నెలలు నిండాలి..
    దయ అనేటి నొప్పులు రావాలి.. అభ్యగులకు తల్లితండ్రి గా మారాలి.
  4. ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఈ బోధకు మూలమెవరు
    అంధకార భక్తిభందురాలను తెంపినదెవరు
    మానవాళి మనోనేత్రమును తెరిపించినది ఎవరు
    విశ్వశాంతికాముకుడు రక్షకుడు ఆయనపేరు
    మంచితనపు మహోన్నతకు పరాకాష్ట ప్రభువు..
    సాటిమనిషి భాదతెలిసి సాయపడిన మన గురువు...
    ఆధ్యాత్మిక అనాథలకు నీడ నిచ్చిన తరువు..
    కారుణ్యపు నిజస్వరూపమునకే ఆయన ఋజువు..
    ప్రభుభోదకు పులకించెను స్వార్ధపు మనుజుల తనువు...
    మార్పుచెంది బీదలకై పంచిన ఆస్తులే ఋజువు.
    అందరికి ఓకే దేవుడు తండ్రి అని ఎరుగానోడురా అనాథ అంటే.
    తనవలె పొరుగువానికి ప్రేమను పంచనోడురా అనాథ అంటే.... ప్రకృతి ఎవరి సొత్తురా దైవము మనిషికిచ్చెరా దాచుకు తినేవాళ్ళురా అనాథలు
    సిరినే నమ్మినోళ్లురా పరణితి లేనివాళ్ళురా స్వార్థము నిండునోళ్ళరా అనాథలు..
    కృశించువారిని సహించనోళ్ళురా అనాథలంటే..
    శుష్కించువారని పోషించు వాళ్ళురా పునీతులంటే..
    నశించువారికై కృశించుపోయెరా దయగల క్రీస్తు...
    ఆనాధజీవుల ఉషస్సుకోరు నా మాదిరి క్రీస్తు...
Blogger ఆధారితం.