రంగు రంగులా లోకమురా
చూస్తూ చూస్తూ వెల్లమాకురా
ఆడపిల్లను ఎరగా చూపుతుందిరా
అందమైన జీవితం కాల్చుతుందిరా " 2 "
నీ కన్నవారి కళలను తుడిచేయకురా
నవమాసాలు మోసిన తల్లిని
మరచిపోకురా " 2 " " రంగురంగులా "
నిను సృష్టించిన ఆదేవుడే
నిను చూసి దుఃఖించుచున్నాడురా
నీవు చేస్తున్న పాపములను చూస్తూ
అనుక్షణము కుమిలిపోతున్నాడుగా " 2 "
తన పోలికలో నిను చూడాలని
ఆశించి నిను సృష్టించాడుగా
నిను రక్షణలో నడిపించాలని
నీకై సిలువలో ప్రాణం విడిచాడుగా " 2 "
" రంగురంగులా "
నీ తలిదండ్రుల ప్రేమను మరచి
నీ ప్రేయసి కోసం పరితపిస్తున్నావుగా
నిన్ను కన్న పేగును తెంచుకుని
లోకాశలతో బ్రతుకుతున్నావుగా " 2 "
ఈ లోక ప్రేమలో పడబోకురా
ఏ క్షణమైనా బలితీస్తుందిగా
దేవుని ప్రేమను రుచి చూసావంటే
నిను పరమునకు చేరుస్తుందిగా " 2 "
" రంగురంగులా "
కామెంట్‌ను పోస్ట్ చేయండి