వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా నలు దిక్కులలో


నలు దిక్కులలో  వెతుకుతున్నా ...    (2)
ఏ చప్పుడైనా - నీవేయని (2)  నిరీక్షిస్తున్నా  

కాదా ... అది నిజము కాదా ...
నిన్ను చూసే ఆ ఘడియ రాదా ...

ఓ దేవా ... నా దేవా ... యేసయ్యా ...

1. ఉదయవేళలో సూర్యోదయములో - సంధ్యవేళలో చంద్రోదయములో
సమీపిస్తున్న ఆ వెలుగులో ... (2)  నీ మోమును కళ్లారా నే చూడాలని 
నీలో పరవశించాలని - ఆశపడుతున్నా

2. నీ ప్రేమను నీ మమకారమును -  నే దూరమయ్యే  ఆ క్షణమును  
నా జీవితములో రానీయక  (2) - ఈ కష్టాల కలశమును తీసివేయ 
నువ్వొస్తావని – నన్నాదరిస్తావని