నశించి-పోయే నన్ను - నీ ప్రేమతో
రక్షించావు (2)
నిన్నే నేను ప్రేమింతును - సాటెవ్వరూ లేరు
నీకు
నా సమస్తం నీకే దేవా
- నా సర్వం నీవేగా (2)
1. పడిపోయిన
నన్ను నీవు - లేవనెత్తి, ఆదరించి
నా దోషముల్ తుడిచివేసి - నీ శక్తితో
నింపినావు (2)
2. నా ధనము నా ఘనము
- నీ మహిమకే అంకితం
లోక స్నేహం కాదయా - నీ కొరకే
జీవింతున్ (2)