Nede priyuni ragam palike nageetham నేడే ప్రియరాగం పలికే నవ గీతం

నేడే ప్రియరాగం పలికే నవ గీతం
ప్రేమే మన కోసం వెలసే
లోకాన శాంతి మురిసింది
మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        ||నేడే||
దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంతా ఉప్పొంగి నర్తించెగా           ||నేడే||
మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవ కాంతి లోకాన ప్రభవించెగా        ||నేడే||
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్ టు యు…
లోకాన శాంతి మురిసింది
మన మనస్సులో రాగాల కాంతి విరిసింది
أحدث أقدم