Muthyala kanna rathnala kanna ముత్యాలకన్నా - రత్నాలకన్నా యేసు రాజన్న - నాకెంతో మిన్న

ముత్యాలకన్నా - రత్నాలకన్నా
యేసు రాజన్న - నాకెంతో మిన్న
కన్న బిడ్డలకన్నా - అన్నదమ్ములకన్నా
బంధుమిత్రులకన్నా - బహు మంచివాడన్నా
మరియమ్మ గర్భాన పుట్టినాడన్న
మహిలోకి రక్షణ తెచ్చినాడన్నా
మార్గము తానే అన్నాడన్నా
మరణము గెలచి లేచినాడన్నా
పాపుల కొరకై వచ్చినాడన్నా
ప్రాణము దానము చేసినాడన్నా
జీవము తానే అన్నాడన్నా
జయ జీవితము ఇచ్చినాడన్నా
నమ్మిన వారిని కాచువాడన్నా
వేడిన వారిని బ్రోచువాడన్నా
దారుణ హింసను ఓర్చినాడన్నా
ధరణికి దీవెన తెచ్చినాడన్నా
أحدث أقدم