Jeevithamentho alppamu nee pranamentho swalpamu జీవితమెంతో అల్పము నీ ప్రాణమెంతో స్వల్పము


Song no:

జీవితమెంతో అల్పము నీ ప్రాణమెంతో స్వల్పము
యేసులేనిజీవితం అగమ్యగోచరం
విసిరివెల్లినగాలి తిరిగిరాదు మళ్ళీ
శాశ్వతముకాదేది యి లోకంలో
ప్రభుయేసునందే నీకు నిజ రక్షణ (2)

నేతగానినాడికంటే వడిగా మరి
సాగుచున్నక్షణములు నిట్టూర్పుతో (2)
జీవితమేఓ శాపంగా జీవనమే పోరాటంగా (2)
బ్రతుకుచున్ననీకు యేసే శాంతి (2)

చింతలన్నిబాపి నిన్ను చేరదీసి
కన్నీరుతుడిచే నా యేసుతో (2)
జీవితమేఓ దీవెనగా జీవనమే ఆనందముగా (2)
బ్రతకాలినీవు ఎల్లప్పుడు (2)
أحدث أقدم