Jeevithanthamu varaku neeke seva salppudhunantini జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని

Song no: 442

జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||

ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||

నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||

మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||

పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

أحدث أقدم