కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజు యేసుని మదిలో నిలుపుమా  “ 2”
విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును “ 2”

 1 .రాతిరంతా ఏడుపొచ్చిన కంటనీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా వెలుగు నీకు కలుగకుండునా 
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా పేరుపెట్టి నిన్ను పిలిచిన
నీ చేయి పట్టి విడచునా అనాధిగా నిన్ను చేయునా  “ విడువడు నిన్ను “

 2.  అంధకారం అడ్డువచ్చినా సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
భాధకలుగు దేశమందునా బంధకాలు వూడకుండునా
శత్రువెంతో పగతో రగిలిన గిన్నె నిండి పొర్లకుండునా “విడువాడు నిన్ను “
        “ కన్నీళ్లతో పగిలిన “