الصفحة الرئيسيةBalaRaj 🎤 పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ byOnline Lyrics List —أبريل 07, 2024 0 సీయోను గీతములు ప పరవాసిని నే జగమున ప్రభువా (2) నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా (2) నీ దరినే జేరెదను నేను.. నీ దరినే జేరెదను || పరవాసిని || లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) అంతయు మోసమేగా (2) వ్యర్ధము సర్వమును ఇలలో.. వ్యర్ధము సర్వమును || పరవాసిని || ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీలోకమున (2) పాపము నిండె జగములో (2) శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము చేకూర్చుకొనే || పరవాసిని || తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో (2) తెలుపుము ఎంత అల్పుడనో (2) విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను || పరవాసిని || ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని (2) క్షమాపణ పొందితివనగా (2) మహానందము కలిగే నాలో.. మహానందము కలిగే || పరవాసిని || యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో (2) అమూల్యమైన ధనముగా (2) పొందితిని నేను యేసునే.. పొందితిని నేను || పరవాసిని || నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో (2) చేరుదున్ పరలోక దేశము (2) నాదు గానము ఇదియే నిత్యము.. నాదు గానము ఇదియే || పరవాసిని || Paravaasini Ne Jagamuna Prabhuvaa (2) Nadachuchunnaanu Nee Daarin Naa Guri Neeve Naa Prabhuvaa (2) Nee Darine Jeredanu Nenu.. Nee Darine Jeredanu || Paravasini || Lokamanthaa Naadani Yenchi Bandhu Mithrule Priyulanukontini (2) Anthayu Mosamegaa (2) Vyardhamu Sarvamunu Ilalo.. Vyardhamu Sarvamunu || Paravasini || Dhana Sampadalu Gouravamulu Dahinchipovu Neelokamuna (2) Paapamu Ninde Jagamulo (2) Shaapamu Chekoorchukone Lokamu.. Shaapamu Chekoorchukone || Paravasini || Thelupumu Naa Anthamu Naaku Thelupumu Naa Aayuvu Yentho (2) Thelupumu Yentha Alpudano (2) Virigi Naligiyunnaanu Nenu.. Virigi Naligiyunnaanu || Paravasini || Aa Dinamu Prabhu Gurtherigithini Nee Rakthamuche Maarchabadithini (2) Kshamaapana Pondithivanagaa (2) Mahaanandamu Kalige Naalo.. Mahaanandamu Kalige || Paravasini || Yaathrikudanai Ee Lokamulo Siluva Moyuchu Saagedanilalo (2) Amoolyamaina Dhanamugaa (2) Pondithini Nenu Yesune.. Pondithini Nenu || Paravasini || Naa Nethramulu Mooyabadagaa Naadu Yaathra Mugiyunilalo (2) Cherudun Paraloka Deshamu (2) Naadu Gaanamu Idiye Nithyamu.. Naadu Gaanamu Idiye || Paravaasini ||