కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను
నాకు సహాయ - మెక్కడ నుండి వచ్చును
1. భూమి ఆకాశములను - సృజించిన
యెహోవా వలన - సాయము కల్గున్
2. నీ పాదము తొట్రిల్ల - నీయడు
నిన్ను కాపాడువాడు-కునుకడు ||కొండ||
3. ఇశ్రాయేలును కాచు - దేవుడు
కునుకడు నిద్రపోడు-యెన్నడు ||కొండ||
4. యెహోవాయే నిన్ను - కాపాడును
నీ కుడి ప్రక్క నీడగా - నుండున్ ||కొండ||
5. పగటెండ - రాత్రి వెన్నెల - దెబ్బ
నీకు తగులకుండ నిను-గాపాడున్ ||కొండ||
6. ఎట్టి అపాయము రా - కుండగను
ఆయన నీ ప్రాణమును - గాపాడున్
7. ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను-గాపాడున్
కామెంట్‌ను పోస్ట్ చేయండి