కన్నీరు కార్చకు ఓ మానవుడా
కరుణాల యేసు నిన్ను చూసిండు
1) దీవి నుండి భువికి దిగివచ్చిండు
సిలువలో బలియై తిరిగి లేచిండు
జీవ మార్గమునీకు చూపిండు
త్యాగశీలి మన అన్న యేసు
2) నిను పెంచినాడు నిను చేర్చుకొనెను
తండ్రికి నీవు తిరగబడియున్నావు
సృష్టి పుట్టక ముందు తండ్రి నిన్ను
నియమించుటకొనెను క్రీస్తులో అన్న
3) నిను పంపు తండ్రి నిన్ను కన్నడు
సృష్టి నంతటిని శాశించురన్న
తండ్రికి నీవు వారసుడవు
రారాజువై నీవు ఏలుర అన్న
إرسال تعليق