కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)
1) ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||
2) వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||
3) సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||
కామెంట్‌ను పోస్ట్ చేయండి