ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా || ఉన్నత ||
1. చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా || ఉన్నత ||
2. పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా || ఉన్నత ||
3. మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము || ఉన్నత ||
Home Unlabelled Unnathamaina sthalamulalo lyrics ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా
Unnathamaina sthalamulalo lyrics ఉన్నతమైన స్థలములలో - ఉన్నతుడా మా దేవా
By Online Lyrics List At జనవరి 11, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి