Unnathamaina prema lyrics ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ

ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
1.        నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ                          (2X)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ              (2X)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                      
… ఉన్నతమైన ప్రేమ …
2.        నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో           (2X)
నీవు కార్చిన రక్తమే నా -  ముక్తి మార్గమై                   (2X)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా                      
… ఉన్నతమైన ప్రేమ …

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.