నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు


నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు

1. తాగుబోతు వైనోడ – తగాదాలు పడినోడ
అటు ఇటు తిరిగినోడ – అల్లరిపాలైనోడ
చీట్ల పేకలాడి నీవు చెల్లకుండ పోయినోడ ||నిన్నే||

2. ఇంటర్మీడియట్ తప్పినోడ – ఎటుగాక పోయినొడ
10వ క్లాసు పోయినోడ చదువారక తిరిగినోడ
బి.ఏ. నీవు చదివేవ – బతకలేకపోయావ ||నిన్నే||

3. పార్టీతో తిరిగినోడ పనికిరాకపోయినోడ
ఉద్యోగం ఊడినోడ ఎలక్షన్లో ఓడినోడ
అప్పుల పాలయ్యావ తిప్పలు పడుచున్నావ ||నిన్నే||

4. డబ్బులెక్కువైనోడ – నిదరపట్టకున్నవాడ
వడ్డీలకు తిప్పేటోడ – వర్రీలో పడ్డవాడ
కులము కులము అన్నావ కూడలేక చచ్చావ ||నిన్నే||