Nathoduga vunnavadave lyrics నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!

నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||
1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||
2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||
3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.