Nadhi nadhi antu vadhula nekendhuku నాది నాది అంటు వాదులాట నీకెందుకు

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి గాని,
భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి
కొలస్సీ 3:1-2
Song no: 108

    నాది నాది అంటు వాదులాట నీకెందుకు
    ఏదినీది కాదు సత్యమిది ఎరుగ వెందుకు
    ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటినే వెదుకు }2 || నాది నాది ||

  1. నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయెనే
    నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోవునే
    క్షణికమైన వాటికొరకు ప్రాకులాట నీకెందుకు
    అక్షయ దైవ రాజ్యమే నిలుచును తుదవరకు || నాది నాది ||

  2. నీదగ్గర ధనముంటే నీచుట్టు మనుష్యులుంటారు
    నీలోపల బలముంటే నిను మా వాడని అంటారు
    నీధనము నీబలగం నీ చావునాపలేవు
    తప్పకుండ ఒక నాడు మట్టిలోన కలుస్తావు || నాది నాది ||

  3. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు
    నీ యెక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు
    గడ్డి పూవులాంటిదేగదా ఇలలోన నీదు జీవితం
    యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్థకం || నాది నాది ||
Blogger ఆధారితం.