Suddha hrudhayam kaluga jeyumu nalonaa.... nalona....


శుద్ధ హృదయం కలుగ జేయుము - (2)
నాలోనా .. నాలోనా - (2) llశుద్ధll

నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము - (2)
పాపము చేశాను దోషినై యున్నాను - (2)
తెలిసియున్నది నా అతిక్రమమే - తెలిసియున్నవి నా పాపములే - (2)
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్య - (2) llశుద్ధll

నీ జ్జానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా - (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం - (2)
కలుగజేయుము నా హృదయములో - (4)
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా - (2) llశుద్ధll
أحدث أقدم