Sarwakrupanidhi yagu prabhuva lyrics

సర్వకృపానిధియగు
1.        సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము -  సంతోషముగ నిను పొగడెదము
పల్లవి:    హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
2.        ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను  కరుణించితివి               .. హల్లెలూయ..
3.        మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి  - మరణ భయములను తీర్చితివి     .. హల్లెలూయ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes