దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును

Song no: 29

Devaa.............. Naa devudavu neeve
vēkuvanē ninnu vedakudunu -2
nī balamunu - prabhāvamunu cūḍa
nēnentō āśatō unnānu
dēvā.............. Nā dēvuḍavu nīvē
vēkuvanē ninnu vedakudunu

  • nīru lēni dēśamandu - dappigonnadi nā prāṇaṁ  -2
    nī mīda āśacēta - som'masillenu nā śarīraṁ -2
    dēvā nā dēvuḍavu nīvē
    vēkuvanē ninnu vedakudunu

  • utsahin̄cu pedavulatō - nā nōru cēsēnu gānaṁ -2
    nī rekkala cāṭunā - śaraṇannadi nā prāṇaṁ -2
    dēvā nā dēvuḍavu nīvē
    vēkuvanē ninnu vedakudunu -2
    nī balamunu - prabhāvamunu cūḍa
    nēnentō āśatō unnānu
    dēvā nā dēvuḍavu nīvē
    vēkuvanē ninnu vedakudunu
  • దేవా.............. నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును -2
    నీ బలమును - ప్రభావమును చూడ
    నేనెంతో ఆశతో ఉన్నాను
    దేవా.............. నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును

  • నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం  -2
    నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2
    దేవా నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును

  • ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2
    నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2
    దేవా నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును -2
    నీ బలమును - ప్రభావమును చూడ
    నేనెంతో ఆశతో ఉన్నాను
    దేవా నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును
  • O God... You are my God,
    I seek You early in the morning -2
    To see Your power and glory,
    I am filled with great longing.
    O God... You are my God,
    I seek You early in the morning.

    In a land without water, my soul thirsts -2
    Because of my longing for You, my body faints -2
    O God, You are my God,
    I seek You early in the morning.

    With joyful lips, my mouth sings praises -2
    Under the shadow of Your wings, my soul finds refuge -2
    O God, You are my God,
    I seek You early in the morning -2
    To see Your power and glory,
    I am filled with great longing.
    O God, You are my God,
    I seek You early in the morning.
    కీర్తనలు 63

    దావీదు యూదా అరణ్యములోనుండగా రచించిన కీర్తన.
    1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును
    2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను.
    నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
    3 నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
    4 నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
    5 క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది
    ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానముచేయుచున్నది
    6 కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను
    నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
    7 నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
    8 నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
    9 నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారువారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
    10 బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.
    11 రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణముచేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.
    Blogger ఆధారితం.