అందాల పసిబాలుడు పవళించె పశుపాకలో

|| ||

అందాల పసిబాలుడు
పవళించె పశుపాకలో
పాపుల రక్షింపనూ
భువిలోకి ఏతెంచెను
|| అందాల ||

పరిశుద్ధుడు – పరమాత్ముడు
ప్రేమామయుడు – నజరేయుడు ||2||
పూజింప రండి.. బాలయేసుని || అందాల ||

రాజుల రారాజు ||2||
అందరిలో అతి సుందరుడు ||2||
స్తుతియింప రండి.. ప్రభుయేసుని || అందాల ||