నిలువరమైన పట్టణమే మన కిలలో లేదురా మానవా
యాత్రికులము - ఆయుష్కాలము } 2
పరదేశులమే ధరణిలో || నిలువర ||
పుట్టుట భూవిలో గిట్టుట కొరకే - వెట్టి శ్రమలను పొందుచు } 2
కొరతలిక్కడ తీరవు ధరణిలో } 2
గాలికొరకే ప్రయాసము || నిలువర ||
మట్టిలోనుండి తీయబడి - మరిమట్టికి తిరిగిపోవుట } 2
మరణము ప్రతిమానవులకు } 2
నిర్ణయించెను దేవుడే || నిలువర ||
నీడవలె మరణమును మనచెంత - విడువక వెను వెంటాడును } 2
నీటి బుగ్గను పోలిన బ్రతుకే } 2
జాడ తెలియదెటు పోవునో || నిలువర ||
పరమార్ధంబగు దేవుని చిత్తము - నెరవేర్చుము ఈ జగతిలో } 2
నెనరుతో ప్రభు నిన్నే బంపెను } 2
కొనసాగుము దేవునితోనే || నిలువర ||
కామెంట్‌లు లేవు: