ప్రభో మహారాజా ప్రభో మహారాజా
మహా శాంతిదాత.. యెహోవా సుతా
ప్రభో మహారాజా..ప్రభో మహారాజా
మనుజాళి కలుషాల తొలగింపగా
- నరకాన పడనీక కాపాడగా
భువి మీద సౌభాగ్య మొనగూర్చగా- దివి శోభ విడనాడి దిగినావుగా || ప్రభో ||
కొరగాని నను నీవు ప్రియమారగా - పరికించి జీవింప చేసేవయ్యా
ప్రతి ఫలము నేనేమి సలిపేనయా - అనుదినము నిను నేను కీర్తించెద || ప్రభో ||
నీ నీతి మార్గాన నడిపించుమా
- నీ ప్రేమ సౌధాన మనజేయుమా
నీ సేవ నేచేసి తరియింపగా
- నీ నీడ నామీద నెలకొల్పుమా || ప్రభో ||