మానవ జాతికి మనసున నీతికి సృష్టికార్తవు నీవే

|| మానవ ||

మానవ జాతికి మనసున నీతికి సృష్టికార్తవు నీవే
శాప విమోచన పాపికి రక్షణ మోక్షప్రదాతవు నీవే
ప్రభో.. ఓ యేసు క్రీస్తు నీరాక ఇలలో తధాస్తు || మానవ ||

అంధుల పాలిట వెలుతురు నీవే
బాందుల పాలిట గమ్యము నీవే
ఎందు వెదకిన రూపము నీవే
అందరి మదిలో దీపము నీవే
ప్రభో.. ఓ యేసు క్రీస్తు నీ నామ గానం శ్రీరస్తు || మానవ ||

బాధలలోన ఓర్పువు నీవే
వేదనలోన ఓదార్పు నీవే
రోదనలోన కరుణవు నీవే
శోధనలోన ఆశ్రయ మీవే
ప్రభో.. ఓ యేసు క్రీస్తు నీ వాక్య ధ్యానం శుభమస్తు || మానవ ||