పరలోక భూలోకంబులకును బ్రభువును

590

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరలోక భూలోకంబులకును బ్రభువును సృష్టికర్తయునౌ పరమ శక్తు డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను ||పరలోక||

  1. ఆయన యద్వితీయ సుతుండౌ నా యేసుని నమ్ముచు నుందు నాయన పరిశుద్ధాత్మ వలన గ న్యా మరియమ్మకు జన్మించె ||పరలోక||

  2. పొంతి పిలాతు అధికారంబున బొంది సిలువ బాధను మృతుడై యంతట భూస్థాపనము జేయబడి యదృశ్య లోకమునకు దిగెను ||పరలోక||

  3. మరి మూడవ దినమున జనిపోయిన మనుజులలో నుండియు లేచి పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబున గూర్చున్నాడు ||పరలోక||

  4. అక్కడ నుండి బ్రతికియున్న జను లందరి జనిపోయినవారి జక్కంగను విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను ||పరలోక||

  5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర నైక్యత బాపక్షమ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్ ||పరలోక||

Post a Comment

కొత్తది పాతది