588
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు ||సఖులారా||
- మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు ||సఖులారా||
- పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి ||సఖులారా||
- ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగ బఠియింప దగుచిత్రముగ ||సఖులారా||
- మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు ||సఖులారా||
- శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని ||సఖులారా||
- ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సార బ్రార్థింతము హితులారా ||సఖులారా||
కామెంట్‌ను పోస్ట్ చేయండి