517
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ ||
- ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల చందము పెంపొందుదు రెంతయు సొంపుగను ||
- దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు( గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతో వెలగుదువు ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి