593
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణకువ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||
- పిల్లలు పెద్దలు పలుకేకలతో బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||
- కొందరు వారిని తొందర జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||
- యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||
- మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||
- మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా సాదర వాక్కులు చక్కగ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ||
إرسال تعليق