పంపుము దేవా దీవెనలతో పంపుము

614

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||బంపుము||

  1. మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసగ క్షమియించుచు ||బంపుము||

  2. వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య ముగ ఫలియింప ||బంపుము||

  3. ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కగ నిచ్చి ||బంపుము||

Post a Comment

కొత్తది పాతది