హోమ్Purushotthamu.C 486 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల సన్నిధికి ప్రభు యేసు నాతో నుండవే నీవు దీనుడు భవ దా ధీనుడ నను గృప తో నడిపించు మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా తము దొలగింపవె ||పైనమై||సరణిలో నేబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెస దొలగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు మరి దిక్కెవ్వరు ||పైనమై||దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకు డను నీ వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము తల్లియు దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ ప్రయాణము తుదముట్టించుము ||పైనమై||పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత మిశ్రమ లణగించుటలై సుందరమగు రవి చందంబున నా ముందట నడువవె ముదమున బ్రభువా ||పైనమై||కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ మత్తఱి నొసగవె ||పైనమై||నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల నీ సౌధము జేర్పవె ||పైనమై||ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాబోవు నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన చోటనె యుంచుము చాలును ||పైనమై|| ✍ పురుషోత్తము చౌధరి Painamai yunnaanayya Nee – Paadhmbujamula Sannidhiki Prabhu Yesu Naathoa Nundave Neevu = Dheenuda Bhavadhaa –Dhinuda Nanu Krupa – Yhoa Nadipinchume-Dhuta Nadhe Simhaa –Dhvaanamuthoa Mruthi Vachchu Chunnadhi – Dhaana Bhayoathpaathamu Tholagimpave. || Painamai || Saraniloane Boavu Napudu – Srama Lennennoa Chanu Dhenchi Naa- Parugu Kaddamugaa Niluchu Nemoa = Maranapu Mullanu – Viruchutakunu Dha –Ddhura Vasthalu Vesa Dholaginchutakunu – Karunaa Nidhi Naa – Sarasa Nundumee- Sarana Gathunaku – Mari Dhikkevvaru || Painamai || Dhevaa Nee Dhakshina Hasthamuthoa – Dheenulanu Pattedha Veravakudanu – Nee Vaagdhaththamuna Kidhi Samayambu = Aa Vachanamunaa – Jeevaadhaaramu – Dhaivamu Thalliyu Thandryu Dhaathavu – Neeve Sarvamu – Ninu Nammithi Naa Throava Prayaanamu – Thudha Muttinchumu || Painamai || Pondhugaa Nee Bhakthiyandhu – Dendha Maanandhinchu Napudu – Sandhiyamu Lennennoa Chanu Dhenchi = Thondhara Nidu – Naa – Throavanu Thadgaa –Daandhatha Misrama – Lanaginchutakai – Sundharamagu Ravi –Chandhambuna Naa Mundhata Naduvave - Mudhamuna Prabhuvaa || Painamai || Kaalambayyenu Raarammanuchu – Neela Meghaakruthi Thoa Vachchi - Kaala Dhandamu Jira Jira Thrippuchu = Chaala Bhayaanaka – Leelan Mruthyuvu – Mroalannilachina – Velanu Dhaalimi –Dhuuli Chanungaa – Boalu Bhavathkaru-Naalingana Sukha- Maththari Nosagave || Painamai || Nee Dhivya Ruupa Dhyaanambu – Nirmalaathmaanthara Sow Khyambu – Naa Dhevuni Premaamrutha Saarambu = Nee Dhaasuni Kavi Niratha Mosanguchu – Naa Dhaarini Gala – Sedh Alu Dheerpanu –Aadhiyu Madhyamu –Anthamu Leni Punaadhulu Gala Nee – Sowdhamu Jerpave || Painamai || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి