హోమ్ 149 byOnline Lyrics List —నవంబర్ 07, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనినఁ పరలోక జీవంబు మన కబ్బును ||దేవుని||సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోఁ జేసెను సర్వోపకారుడుండే మన మీద జాలిపరుఁడై యుండెను ||దేవుని||మానవుల రక్షింపను దేవుండు తన కుమారునిఁ బంపెను మన శరీరముఁ దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుఁడే ||దేవుని||యేసుక్రీస్తను పేరున రక్షకుఁడు వెలసి నాఁడిలలోపల దోసకారి జనులతో నెంతోను భాషలను బల్కినాఁడు ||దేవుని||పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములఁ బొందెడి పాపులందఱు నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను సత్ప్రేమగ నడిచెను పరలోక సద్బోధలిక జేసెను ||దేవుని||చావు నొందిన కొందఱిన్ యేసుండు చక్కఁగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి ||దేవుని||గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాఁడే మేలు గల యద్భుతములు ఈలాగు వేలకొలఁదిగ జేసెను ||దేవుని||చేతుల కాళ్లను రా రాజు చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్ ||దేవుని||ఒడలు రక్తము గారఁగ దెబ్బలు చెడుగు లందఱుఁ గొట్టిరి వడిముళ్లు తలమీఁదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||ఇన్ని బాధలు బెట్టుచుఁ దనుఁ జంపు చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేఁడెను ||దేవుని||రక్షకుడు శ్రమఁ బొందఁగా దేశంబు తక్షణము చీఁక టయ్యెన్ రక్షకుఁడు మృతి నొందఁగఁ తెర చినిఁగి రాతి కొండలు పగిలెను ||దేవుని||రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును పాఁతి పెట్టిరి భక్తులు నమ్మిన నాతు లందఱుఁ జూడఁగా ||దేవుని||మూఁడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాఁడు నాఁడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్ ||దేవుని||పదునొకండు మారులు వారలకుఁ బ్రత్యక్షుఁ డాయె నేను పర లోకమున కేగెను తన వార్తఁ బ్రకటించు మని పల్కెను ||దేవుని||నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని|| ✍ గొల్లపల్లి నతానియేలు Dhevuni Prema Yidhigoa – Janulaara – Bhaavambunanu Theliyare = Kevalamu Nammukonina – Paraloaka – Jiivambu Mana Kabbunu || Dhevuni || Sarva Loakamau Manalanu – Thana Vaakya – Sathyambu Thoa Jesenu = Sarvoapa Kaarudunde – Mana Miidha – Jaali Parudai Yundenu || Dhevuni || Maanavula Rakshimpanu – Dhevundu – Thana Kumaa Runi Pampenu = Mana Sariiramu Dhaalchenu – Aa – Prabhu Vu – Mana Paapamunaku Dhuurude || Dhevuni || Yesu Kriisthanu Peruna – Rakshakudu Velasi Naa Dila Loapala = Dhoasakaari Janulathoa – Eanthoa Su – Bhaashalanu Palki Naadu || Dhevuni || Paapa Bhaarambu Thoada – Ne Prodhdhu – Prayaasamula Pondhedi = Paapulandharu Nammina – Visraanthi – Paripuurna Miththu Nanenu || Dhevuni || Sathulaina Purushulainan – Aa Kartha Sarva Janula Yedalanu = Sathpremaga Nadichenu – Paraloaka Sadhbhoadha Lika Chesenu || Dhevuni || Chaavu Nondhina Kondharin- Yesundu – Chakkagaa Brathikinchenu = Sakala Vyaadhula Roagulu – Prabhu Nanti Svasthambu Thaamondhiri || Dhevuni || Gaali Sandhrapu Pongulan – Sadhdhanapi – Niillapai Nadachi Naade = Melu Gala Adhbhuthamulu – Eii Laagu Vela Koladhiga Jesenu || Dhevuni || Chethula Kaalla Loanu – Raaraaju – Chera Mekulu Pondhenu- = Paathakulu Kottinaare – Parisudhdha – Niithi Thaa Moarva Lekan || Dhevuni || Vodalu Rakthamu Kaaraga – Dhebbalu – Chedugu Landharu Kottiri = Vadi Mullu Thala Miidhanu – Pettiri Oarchenoa Rakshakundu || Dhevuni || Einni Baadhalu Pettuchu – Thanu Jampu – Chunna Paapa Narulanu = Manninchu Mani Thandrini – Yesundu Sannuthithoa Vedenu || Dhevuni || Rakshakudu Srama Nondhagaa – Dhesambu Thaksha Namu Chiika Tayyen = Raksha Kudu Mruthi Nondhaga– Thera Chinigi – Raathi Kondalu Pagilenu || Dhevuni || Raathi Samaadhi Loanu – Rakshakuni – Niithigala Dhehambunu = Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landharu Chuudagaa || Dhevuni || Muudava Dhina Mandhuna – Yesundu – Mruthi Gelchi Lechi Naadu = Naadu Nammina Manujulu – Chuuchiri – Nalu Vadhi Dhinamu Landhun || Dhevuni || Padhu Nokandu Maarulu – Vaaralaku – Prathyakshu Daayanesu = Para Loaka Muna Kegenu – Thana Vaartha – Prakatinchu Mani Palkenu || Dhevuni || Nammi Baapthisma Mondhu – Narulaku – Rakshana Mari Kalgunu = Namma Nollaka Poayedu – Narulaku – Narakambu Sidhdha Manenu || Dhevuni || ✍ Gollapalli Nathaniyelu akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి