الصفحة الرئيسيةAKK📖 దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన byOnline Lyrics List —أكتوبر 28, 2024 0 4 దేవుని యనూనత్వములు రాగం - కేదారగౌళ తాళం - ఆది దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర ||దేవా||సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి ||దేవా||అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా||సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె ||దేవా|నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు ||దేవా||ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె ||దేవా|| ✍ పురుషోత్తము చౌధరి Dheva dhivyanantha pra-bhaava- maampaahi ghana yoahoavaa =sthaavara jangama –sahitha nikhila jaga – dhaavana paavana – bhaava niranthara Dheva || Dheva || Saara –kaarunya paaraa – vaaraa –sarvajna nirvi- kaaraa – yesu naamaava – thaaraa –dhiina janoapa kaaraa = ghoara maina sam-saaratavi badi- dhaari kanani nanu – chera pilichithivi Dheva || Dheva || Akshii-na vibhavaanandha – moaksha –raajya mahimaa –dhyaksha – santhatha sujana rakshaa – kapata dhurmanuja – sikshaa = paksha vipaksha vi- lakshana rahithaka – taakshyamu naadhesa - dhiikshanu nilupave Dheva || Dheva || Sundharaascharya guna –brindhaa – bandhura nithyaa –nandhaa – saadhu sajjana vandhyaa – khanditha kalusha brundhaa = mandha mathini naa – dendhamu kadu theli – vondha chesi nii –yandhu nilupa gadhe Dheva || Dheva || Niivu - nannu srushtinchi – naavu – naa guru raad dhevudavu – kriisthu yesuni – chaavu valana – nanmanipi – naavu = paavana janaka su –thaathmala thoadanu kevala mokkada – vai veligedi prabhu Dheva || Dheva || Prema svaroopa nithya –kshema – pathitha paavana – naama dhaasa loakaabdhi – soama sarvesa parama – dhaama = nema merungani – niichuda nadhamuda – noa mahatma dhaya – thoa mannimpave || Dheva || ✍ Purushottam Chowdhary akk 4