స్వరాల స్వాగతలు ఈవేళ

Swarala Swagathalu Evela

పల్లవి:- స్వరాల స్వాగతలు ఈవేళ సుస్వర్ణ లిఖితమైన పదాలు ||2||
నాలో తనలపించగా పాటగా నయేసుకర్పించనా మాలగా || స్వరాల||
చరణం1:- కనులు కాయలై నిదురాయే రాక ప్రభుని రాకకై యెదురు చూచు వేళ||2||
పగలు ప్రభుని తలచి అలసిపోయి కలలు కనులు విడిచి కదలు వేళ ||2||
దేవుడు స్వర్గమే విడచి ఇలకు రాగా, దీనులు దేవుని దరికి చేరుకోగ
క్రీస్తుని రాజ్యమే మనము చేరుకోమ ||స్వరాల||
చరణం2:-జనులు జ్ఞనులై పాపమే లేక, ప్రభుని బాటలో సాగిపోవు వేళ ||2||
ధరణి కరుణ కురిసి తడసిపోయి, జగమే ప్రభుని తలచి మరయువేళ ||2||
దేవుడు మనిషిలో మనసు గెలుచుకోగ , దీనులు దేవుని దరికి చేరుకోగ
మనసున ఆశలే నిజములవ్వు వేళ ||స్వరాల ||